: టికెట్ ఇస్తే పోటీ చేస్తానని చెబుతున్న 'గాయపడిన' మైనర్ బాలిక!
కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే 2017 ఎన్నికల్లో పోటీ చేస్తానని ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాకు చెందిన ఓ మైనర్ బాలిక పేర్కొంటోంది. బీఎస్పీ ఎమ్మెల్యే చేతిలో అత్యాచారానికి గురైన సదరు బాలిక, తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నట్టు తెలిపారు. దీనిపై ఏఐసీీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలను కలిశానని ఆమె చెప్పారు. 2010 నవంబర్ లో అప్పటి బీఎస్పీ ఎమ్మెల్యే పురుషోత్తం ద్వివేదీ చేతిలో ఆమె లైంగిక దాడికి గురైంది. దీంతో ఆయన ఇంటి నుంచి పారిపోయిేందుకు ప్రయత్నించిన సదరు బాలికపై ద్వివేదీ దొంగతనం కేసు పెట్టి అరెస్టు చేయించాడు. అనంతరం బాలిక తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు, వైద్యపరీక్షల రిపోర్టుల ఫలితంగా ద్వివేదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని సదరు బాలిక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్టు తెలిపింది.