: ల్యాప్ టాప్ సైజు...3 కేజీల బరువు...పది కిలోమీటర్లు వేగం...కొత్త కారు ఆవిష్కరణ!
ఆధునిక సాంకేతిక యుగంలో అవసరాలకు అనుగుణంగా సౌకర్యాలను పరిశోధకులు సమకూర్చుతున్నారు. తాజాగా కేవలం ల్యాప్ టాప్ సైజులో ఇంచుమించు 3 కేజీల బరువున్న కారును జపాన్ ఇంజనీర్ కునియోకో సాశియో రూపొందించారు. అంత చిన్న కారులో ఎలా కూర్చుంటాం అని సందేహం వచ్చిందా? దీనిలో కూర్చునే అవకాశం లేదు. నిల్చునే ప్రయాణించాలి. అందుకే దీనికి వాక్ కార్ అని పేరుపెట్టారు. స్కేటింగ్ రోలర్ టైపులో కనిపించే ఈ కారు 120 కేజీల బరువున్న మనిషిని గంటకు పది నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో తీసుకెళ్లగలదని వారు వెల్లడించారు. లిథియం బ్యాటరీతో నడిచే ఈ కారును ఎంచక్కా బ్యాగులో పెట్టుకుని వెళ్లిపోవచ్చని ఆయన తెలిపారు. 2016లో జపాన్ మార్కెట్ లోకి దీనిని ప్రవేశపెట్టనున్నట్టు ఆయన వెల్లడించారు. దీని ధర 800 డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.