: బ్యాంక్ హాల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న రోబో


సాంకేతిక పరిజ్ఞానం మరింతగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో రోబోల ప్రాముఖ్యం పెరుగుతోంది. చైనా, జపాన్ వంటి పలు దేశాల్లో రోబోలతోనే అనేక పనులు చేయిస్తున్నారు. జపాన్ లో అయితే రోబోలతోనే ఓ హోటల్ ను నిర్వహిస్తున్నారు. తాజాగా చైనాలోని చెంగ్డూలో బ్యాంక్ ఆఫ్ కమ్యూనికేషన్ లో రోబోను హాల్ మేనేజరుగా నియమించారు. ఆ రోబో పేరు జియోజియో. బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులకు స్వాగతం పలుకుతూ అవసరమైన సమాచారాన్ని ఇస్తుందట. మీటరు ఎత్తులో ఉన్న ఆ రోబోను చూసి బ్యాంకుకు వచ్చిన కస్టమర్లంతా ఆశ్చర్యపోతూ దానినే కన్నార్పకుండా చూస్తున్నారు.

  • Loading...

More Telugu News