: తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్


తెలంగాణ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ అనుమతి తెలిపారు. ఈ నెల 15 తరువాత నియామకాలు చేపట్టాలని టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఆదేశించారు. మార్కెట్ దేవాలయ కమిటీల నియామకాల జాబితాలను సిద్ధం చేయాలని, రిజర్వేషన్ల ప్రకారమే మార్కెట్ కమిటీ ఛైర్మన్ల నియామకం ఉంటుందని తెలిపారు. పార్టీ మండల, జిల్లా కమిటీలను కూడా 15వ తేదీ తరువాత ఎంపిక చేయాలన్నారు. టీఆర్ఎస్ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. గ్రామజ్యోతి పథకంలో భాగంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని మరోసారి సూచించారు. ఇదే సమయంలో 12 కార్పోరేషన్ల పాలక మండళ్ల నియమకానికి కూడా సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలంగాణలో వీలైనన్ని స్మార్ట్ సిటీల సంఖ్యను పెంచుకోవాలని, ఇందుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని పార్టీ నేతలకు తెలిపారు. ఈ క్రమంలో స్మార్ట్ సిటీల జాబితాను సిద్ధం చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పారు.

  • Loading...

More Telugu News