: ఆగస్టు 15వ తేదీని బూటకపు స్వాతంత్ర్యదినంగా పాటించాలి: మావోయిస్టులు


భారత దేశంలో ఇంకా స్వాతంత్ర్యం రాలేదని... అలాంటప్పుడు స్వాతంత్ర్యదినాన్ని ఎలా జరుపుకుంటామని మావోయిస్టులు ప్రశ్నించారు. ఆదివాసీలపై ఇంకా అత్యాచారాలు కొనసాగుతున్నాయని, వారికి ఇంతవరకు కనీస హక్కులు కూడా సంక్రమించలేదని మండిపడ్డారు. బ్రిటీష్ వారి నుంచి రాజ్యాధికారం బదిలీ అయినప్పటికీ... భూస్వామ్య, పెట్టుబడి వర్గాల చేతుల్లోనే అధికారం కేంద్రీకృతమైందని తెలిపారు. ఈ నేపథ్యంలో, ఆగస్టు 15వ తేదీని బూటకపు స్వాతంత్ర్యదినంగా పాటించాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు, ఖమ్మం జిల్లా చర్ల మండలంలోని రహదారిపై పోస్టర్లను అతికించారు.

  • Loading...

More Telugu News