: వేతనాలు పెంచితే కేంద్ర ఖజానాపై రూ. లక్ష కోట్ల భారం
7వ వేతన సంఘం సిఫార్సులను అమలు చేస్తే కేంద్ర ఖజానాపై రూ. లక్ష కోట్ల భారం పడనుంది. దీని వల్ల వివిధ సంక్షేమ పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఈ రోజు పార్లమెంటు ముందుకు వచ్చిన 'మీడియం టర్మ్ ఎక్స్ పెండీచర్ ఫ్రేమ్ వర్క్'లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు 9.56 శాతం పెరిగితే, 2015-16 సంవత్సరంలో రూ. 1,00,619 కోట్లను వేతనాలుగా చెల్లించాల్సి వుంటుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ నివేదికలో వెల్లడించారు. ఇక 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం 15.79 శాతం మేరకు వేతనాలు పెంచితే, రూ. 1.16 లక్షల కోట్ల భారం పడుతుందని ఆయన అన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు సవాళ్లు ఎదురయ్యేలా చేస్తుందని అభిప్రాయపడ్డారు.