: మనుషులకైతే చెబుతాం... సంస్కార హీనులకు ఏం చెబుతాం?: కడియం


టీటీడీపీ నేతలు తనపై చేస్తున్న ఆరోపణలపై టీఎస్ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మండిపడ్డారు. తన పుట్టుక, కులానికి సంబంధించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనవసరంగా మాట్లాడటం ఆపి, తమ వద్ద ఆధారాలు ఏమైనా ఉంటే చూపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, దామోదర రాజనరసింహలు కూడా మాదిగ ఉపకులం వారే అని... అయినా, వారెవరి గురించీ మాట్లాడకుండా, కేవలం తననే టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు. మనుషులకైతే చెబుతాం... సంస్కార హీనులకు ఏం చెబుతామని అన్నారు. టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీరు బండి కింద కుక్కలా ఉందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News