: ఒక్క రోజులో కొండెక్కిన బంగారం ధర, మళ్లీ రూ. 26 వేలకు


బంగారం ధర భారీగా పెరిగింది. బుధవారం ఒక్క రోజులో కొండెక్కి కూర్చుంది. నిన్న మొన్నటి వరకూ రూ. 25 వేల లోపుగా ఉన్న పది గ్రాముల బంగారం ధర, రెండు సెషన్ల వ్యవధిలో రూ. 1000 పెరిగింది. నేటి బులియన్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ. 600 పెరిగి మరోసారి రూ. 26 వేలకు చేరింది. ఆభరణాల విక్రేతల నుంచి వచ్చిన డిమాండ్ గణనీయంగా పెరగడంతోనే ఇలా జరిగిందని నిపుణులు వ్యాఖ్యానించారు. శ్రావణ మాసం ప్రారంభం కానున్న తరుణంలో తిరిగి కొనుగోళ్లు పుంజుకోవచ్చన్న అంచనాలే జ్యూయెలర్స్ ను కొత్త కొనుగోళ్ల వైపు నడిపించినట్టు తెలుస్తోంది. కాగా, ముంబై మార్కెట్లో ఆభరణాల బంగారం ధర పది గ్రాములకు రూ. 25,800కు చేరగా, కిలో వెండి ధర రూ. 295 పెరిగి రూ. 35,625కు చేరింది.

  • Loading...

More Telugu News