: ఢిల్లీలో మకాం పెట్టు, హోదా సాధించుకు రా!: చంద్రబాబుకు రఘువీరా సలహా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణం తన మకాం ఢిల్లీకి మార్చాలని ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు మంత్రులతో సహా ఢిల్లీ వెళ్లి పోరాడాలని సలహా ఇచ్చారు. ప్రత్యేక హోదాను సాధించిన తరువాతనే రాష్ట్రానికి రావాలని, అప్పుడు ప్రజలు ఘనస్వాగతం పలుకుతారని రఘువీరా వ్యాఖ్యానించారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అరుణ్ జైట్లీ మాట్లాడుతున్నారని, ప్రధానికి జగన్ భయపడుతూ, కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారని రఘువీరా ఎద్దేవా చేశారు.