: 'ఓటుకు నోటు' కేసులో లోకేష్ కారు డ్రైవరుకు ఏసీబీ నోటీసులు


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో, తెదేపా యువనేత, సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి తెలంగాణ ఏసీబీ ఈ మధ్యాహ్నం నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఈ కేసులో డబ్బు బట్వాడాలో కొండల్ రెడ్డి స్వయంగా పాలు పంచుకున్నాడన్నది ఆయనపై ఉన్న అభియోగంగా తెలుస్తోంది. గతంలో ఇదే కేసులో పలువురిని విచారించిన సందర్భంగా కొండల్ రెడ్డి పేరు వెలుగులోకి రాగా, తాజాగా ఆయన్ను ప్రశ్నించేందుకు ఏసీబీ రంగంలోకి దిగింది. ఆయన ప్రమేయంపై ఆధారాలు దొరికితే, వెంటనే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

  • Loading...

More Telugu News