: లలిత్ మోదీ అంశంలో నేనెలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు: సుష్మాస్వరాజ్


లలిత్ మోదీ అంశంలో కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్ లోక్ సభలో మరోసారి వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తానెలాంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేశారు. అలాగే ఎలాంటి తప్పు చేయలేదని, తనలో అపరాధ భావం కూడా లేదని సభలో జరిగిన చర్చలో భాగంగా సమాధానం ఇచ్చారు. ఈ అంశంలో మొదటి నుంచీ సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నానని, విపక్షాలే తన మాట వినలేదని అన్నారు. అయితే సభలో ఆందోళన చేయాలని, సభను అడ్డుకోవాలన్న లక్ష్యంతోనే విపక్షాల తీరు ఉందని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్న మహిళకు సాయం చేయాలన్న ఉద్దేశమే తప్ప ఈ అంశంలో తనకెలాంటి దురుద్దేశాలు లేవని సుష్మ తేల్చి చెప్పారు. సభలో సుష్మ ప్రసంగిస్తున్నంత సేపు కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేస్తూనే ఉన్నారు.

  • Loading...

More Telugu News