: రాముడు, సీత, రావణుడు, ధర్మరాజు అంతా ఒకచోటే చేరారు!
భారత రాజకీయాలకు, వినోద పరిశ్రమకు విడదీయరాని అనుబంధం ఉంది. వివిధ సినిమాలు, సీరియళ్లలో పోషించిన పాత్రల ద్వారా ప్రజాదరణ పొందిన నటులు రాజకీయ నాయకులుగా మారి చట్టసభల్లో సభ్యులుగా కొనసాగుతున్నారు. ప్రముఖ దర్శకుడు రామానంద సాగర్ రూపొందించిన టీవీ సీరియల్స్ 'రామాయణం'లో సీత, రావణుడు; 'మహా భారత్'లో ధర్మరాజు పాత్రలు పోషించిన నటీనటులు బీజేపీలో ఉన్నారు. రాముడు కూడా త్వరలోనే బీజేపీలో చేరనున్నాడు. రావణ పాత్రధారి అరవింద్ త్రివేదీ రెండు సార్లు బీజేపీ ఎంపీగా పని చేశారు. సీత పాత్రధారి దీపికా చికాలియా కూడా బీజేపీ ఎంపీగా రెండు సార్లు పని చేశారు. రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్ బీజేపీలో చేరనున్నట్టు ప్రకటించారు. భారతంలో ధర్మరాజు పాత్రధారి గజేంద్ర చౌహాన్ బీజేపీ నేత. ఆయనే పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇలా సీతారాములు, రావణుడు, ధర్మరాజు అందరూ బీజేపీ నేతలుగా మారారు.