: తెలంగాణ నిరుద్యోగులకు ఝలక్కిచ్చిన కడియం


తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే టీచర్ పోస్టుల భర్తీ చేపడుతుందని ఎంతో ఆశగా ఎదురు చూసిన నిరుద్యోగులకు విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ఝలక్కిచ్చారు. ఈ ఏడాది డీఎస్సీ భర్తీ లేనట్టేనని ఆయన ప్రకటించారు. ఉపాధ్యాయ నియామకాలపై వచ్చే ఏడాది చర్చించిన అనంతరం, ఎప్పుడు నిర్వహించాలో నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలకు సమస్యలున్నాయన్న విషయం తెలుసని తెలిపిన ఆయన, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఉద్యోగభర్తీ చేపట్టడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్ధి సంఘాలు దీనిపై ఎలా స్పందిస్తాయో చూడాలి.

  • Loading...

More Telugu News