: రాజయ్యను మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారో కేసీఆర్ చెప్పాలి: పొన్నాల


మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్యను పదవి నుంచి ఎందుకు తొలగించారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కేవలం కేసీఆర్ అహంకారం వల్లే వరంగల్ లోక్ సభ స్థానానికి ఉప ఎన్నిక వచ్చిందని మండిపడ్డారు. ఈ ఎన్నికలో విజయకేతనం ఎగురవేస్తామని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా కరవు పరిస్థితులు నెలకొన్నప్పటికీ... రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో కనీసం 20 శాతం మందికి కూడా రైతు రుణమాఫీ జరగలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం అటకెక్కిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News