: ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి కశ్యప్ నిష్క్రమణ
ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ నుంచి భారత క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ పోరు ముగిసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో తన ప్రత్యర్థి, వియత్నాం క్రీడాకారుడు టియోన్ మిన్ చేతిలో ఓటమి పాలయ్యాడు. 21-17, 13-21, 18-21 తేడాతో కశ్యప్ పై మిన్ గెలుపొందాడు.