: వెయిటింగ్ లిస్టు పాసింజర్లకు శుభవార్త... బ్యాకప్ ట్రైన్లలో బెర్తులు


రైల్ టికెట్ కొంటే కన్ఫర్మ్ కాలేదా? అయితే మీకో శుభవార్త. టికెట్ రద్దు చేసుకునే అవసరం లేకుండా, అదే టికెట్ పై అదే రోజు మరో రైల్లో ప్రయాణం చేసే సదుపాయాన్ని భారతీయ రైల్వేలు దగ్గర చేయనున్నాయి. రైల్వే బోర్డు అదనపు డైరెక్టర్ జనరల్ అనిల్ కుమార్ సక్సేనా వెల్లడించిన వివరాల ప్రకారం 'బ్యాకప్ ట్రైన్ల'లో ప్రయాణికులకు బెర్తులిస్తారు. వెయిటింగ్ లిస్టులోని ప్రయాణికులకు తరువాత వచ్చే రైళ్లలో ఖాళీలను బట్టి సీట్లిస్తామని, ఈ ప్రతిపాదనలు ప్రారంభ దశలో ఉన్నాయని ఆయన వివరించారు. ప్రయాణికుల సంఖ్యను బట్టి తదుపరి రైళ్లలో అదనపు బోగీలు వేస్తామని తెలిపారు. కాగా, గత జూన్ లో వెయిటింగ్ లిస్టు ప్రయాణికులకు తక్కువ ధరకు విమాన టికెట్లను అందించేలా ఐఆర్ సీటీసీ వెలువరించిన స్కీములకు అంతంతమాత్రంగానే స్పందన వచ్చింది. ఈ స్కీములో భాగంగా గో ఎయిర్ తో డీల్ కుదుర్చుకోగా, దాదాపు 100 టికెట్ల వరకూ అప్ గ్రేడ్ చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది.

  • Loading...

More Telugu News