: మంత్రాలయ రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న సుధామూర్తి


ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఈ రోజు కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. తరువాత గ్రామ దేవత మంచాలమ్మ, రాఘవేంద్రస్వామి మూల బృందావనాన్ని క్యూ లైన్ లో వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ఆమె మంత్రాలయ పీఠాధిపతి ఆశీర్వచనం స్వీకరించారు. అంతకుముందు బెంగళూరు నుంచి హెలికాప్టర్ లో ఎమ్మిగనూరు చేరుకున్న సుధ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మంత్రాలయం రాగా... మంత్రాలయం మఠం అధికారులు స్వాగతం పలికారు.

  • Loading...

More Telugu News