: రూపాయి ఆదాయం రాని ఏపీ ఎక్స్ ప్రెస్ మనకెందుకు?: ద.మ.రై ఉద్యోగ సంఘాల ధ్వజం


ఈస్ట్ జోన్ లో భాగంగా ఉన్న విశాఖపట్నం నుంచి ప్రారంభమయ్యే ఏపీ ఎక్స్ ప్రెస్ రైలుతో రాష్ట్రానికి రూపాయి ఆదాయం కూడా రాదని దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగ సంఘాల కార్యదర్శి చలపతి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా రాకుండా ఏపీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించడం సరికాదని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ ను తక్షణం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ నుంచి రైలును నడిపితే, టికెట్ల ఆదాయమంతా ఈస్ట్ జోన్ కే వెళుతుందని, ఇక అటువంటి రైలు మనకెందుకని అన్నారు. ఏపీ ఎక్స్ ప్రెస్ కు సిబ్బందిగా విజయవాడ వారిని కాదని విశాఖ వారిని ఎక్కిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దీన్ని అడ్డుకుంటామని విజయవాడ జోన్ లోకి రైలు రాగానే ఈస్ట్ కోస్ట్ సిబ్బందిని దించేస్తామని చలపతి హెచ్చరించారు.

  • Loading...

More Telugu News