: నేనొక్క ఈ-మెయిల్ కొడితే, హిల్లరీ క్లింటన్ అరెస్టే: బాబీ జిందాల్ సంచలన వ్యాఖ్య


అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ సతీమణి, ప్రస్తుతం అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ అరెస్ట్ కావడానికి ఒక్క ఈ-మెయిల్ దూరంలో ఉన్నారని లూసియానా గవర్నర్, భారత సంతతి యూఎస్ నేత బాబీ జిందాల్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తిగత మెయిల్స్ లోని సమాచారాన్ని ఆమె వాడుకున్నారని, కోర్టు ప్రొసీడింగ్స్ లో భాగంగా పలు అబద్ధాలు చెప్పారని ఆయన ఆరోపించారు. తన వద్ద ఉన్న వివరాలను ఒక్క ఈ-మెయిల్ ద్వారా పంపితే ఆమె అరెస్టు ఖాయమని అన్నారు. టాప్ సీక్రెట్ గా ఉంచాల్సిన మెయిల్స్ ను సర్వర్ నుంచి ఆమె ఓపెన్ చేసి వాడుకున్నారన్న విషయం బహిర్గతమైందని తెలిపారు. హిల్లరీ తాను సెక్రటరీగా ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. వీరిద్దరూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News