: కుప్పకూలుతున్న శ్రీలంక బ్యాటింగ్ లైనప్
టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మాయాజాలానికి శ్రీలంక్ మిడిలార్డర్ కుప్పకూలుతోంది. గాలేలో జరుగుతున్న తొలి టెస్టులో భోజన విరామ సమయానికి (23 ఓవర్లు) ఆతిథ్య శ్రీలంక జట్టు 65 పరుగులకు ఏకంగా ఐదు వికెట్లు కోల్పోయింది. లంక బ్యాట్స్ మెన్ కరుణరత్నే (9), సిల్వ (5), తిరిమన్నే (13), సంగక్కర (5), ముబారక్ (0) పెవిలియన్ చేరారు. తిరిమన్నె, సంగక్కర, ముబారక్ లను అశ్విన్ బలిగొన్నాడు. ప్రస్తుతం మాథ్యూస్ (26), చండిమల్ (5)లు క్రీజులో ఉన్నారు.