: దయానిధి మారన్ కు సుప్రీంకోర్టులో ఊరట
టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్ కు అత్యున్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. మూడు రోజుల్లోగా సీబీఐ అధికారుల ముందు ఆయన లొంగిపోవాలంటూ మద్రాస్ హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు జారీచేసే వరకూ మారన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది. అనధికార టెలిఫోన్ ఎక్చేంజ్ కేబుళ్ల కేసులో మారన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించిన సంగతి తెలిసిందే.