: నిరాశపరిచిన సంగక్కర... శ్రీలంక 27/3
గాలేలో భారత్ తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంక తడబడుతోంది. 12 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు. ఓపెనర్లు కరుణరత్నే (9), సిల్వ (5) శ్రీలంక స్కోరు 15 పరుగులు ఉన్నప్పుడు వరుసగా పెవిలియన్ చేరారు. అనంతరం బరిలోకి దిగిన స్టార్ బ్యాట్స్ మన్ సంగక్కర కూడా ఎక్కవ సేపు క్రీజులో నిలువలేకపోయాడు. తన కెరీర్ లో చివరి సిరీస్ ఆడుతున్న సంగ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి అశ్విన్ బౌలింగ్ లో రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. సంగక్కర ఔట్ కావడంతో శ్రీలంక ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. భారత బౌలర్లలో ఇషాంత్, ఆరోన్, అశ్విన్ లు చెరో వికెట్ తీశారు.