: మబ్బు పట్టింది, వానొచ్చేనా?... ఆశగా నింగికేసి చూస్తున్న రైతన్న


తెలుగు రాష్ట్రాలపై ఆకాశం మేఘావృతమైంది. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నా నేల కరవు తీరి పంటలకు లాభపడే వర్షాలు ఇంకా ఎక్కడా కురవలేదు. దీంతో రైతన్న ఆకాశంవైపు ఆశగా చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాల్లో నాటిన పత్తి పంటకు ప్రస్తుతం వర్షం అత్యవసరం. పత్తితో పాటు మిరప తదితర పంటలకు, కూరగాయలకూ కూడా వర్షం అవసరం. కాగా, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా, ఒడిశా తీరాలను ఆనుకొని ఏర్పడ్డ ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణతో పాటు ఏపీలోని పలు ప్రాంతాలలో నేడు, రేపు చిరు జల్లుల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ అల్పపీడనం మరింతగా బలపడితే, వచ్చే రెండుమూడు రోజుల్లో విస్తారమైన వర్షాలు పడతాయని వివరించారు.

  • Loading...

More Telugu News