: ఏపీ ఎక్స్ ప్రెస్ ప్రారంభం... తెలంగాణ ఎక్స్ ప్రెస్ కూడా
ఆంధ్రప్రదేశ్ నుంచి దేశ రాజధాని న్యూఢిల్లీకి కొత్తగా ప్రవేశపెట్టిన ఏపీ ఎక్స్ ప్రెస్ కొద్దిసేపటి క్రితం బయలుదేరింది. ఏపీలోని విశాఖ నుంచి న్యూఢిల్లీ మధ్య రాకపోకలు సాగించనున్న ఈ రైలును కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు న్యూఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. అదేవిధంగా ఇప్పటిదాకా హైదరాబాదు-న్యూఢిల్లీల మధ్య నడుస్తున్న ఏపీ ఎక్స్ ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్ ప్రెస్ గా మారింది. ఈ రైలును కూడా సురేశ్ ప్రభు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు.