: ఆరెస్సెస్ ఆఫీసుకూ జెడ్ ప్లస్ భద్రత... బాధ్యతలు చేపట్టిన సీఐఎస్ఎఫ్ బలగాలు


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ కు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. పలు వర్గాల నుంచి భగవత్ కు ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కేంద్రం ఆయనకు ఈ తరహా భద్రత కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మహారాష్ట్ర నాగ్ పూర్ లోని ఆరెస్సెస్ కార్యాలయానికి కూడా కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఆరెస్సెస్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులను అందుకున్న సీఐఎస్ఎఫ్ బలగాలు నిన్న ఆరెస్సెస్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News