: ట్విట్టర్ లో బాలీవుడ్ బాద్ షా శాల్యూట్ సెల్ఫీ!


స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో శాల్యూట్ సెల్పీని పోస్ట్ చేశాడు. ‘‘దేశం, దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసిన సైనికులకు వందనం’’ అంటూ తన శాల్యూట్ సెల్ఫీకి కామెంట్ ను జోడించాడు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ట్విట్టర్ లో భారత సైనికులకు నివాళి అర్పించేందుకు క్రీడాకారులు, సినీ ప్రముఖులు ఇటీవల ‘శాల్యూట్ సెల్ఫీ’కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, శ్రీశాంత్, బాలీవుడ్ తారలు నానా పటేకర్, జాన్ అబ్రహాం, సోనాక్షి సిన్హా, సోనూ సూద్ తదితరులు తమ శాల్యూట్ సెల్ఫీలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News