: రంగంలోకి దిగిన చంద్రబాబు... ‘హోదా’ కోసం కేంద్ర మంత్రులతో ఫోన్ మంతనాలు


ఏపీకి ప్రత్యేక హోదా కోసం సీఎం నారా చంద్రబాబునాయుడు రంగంలోకి దిగారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర మంత్రులు భిన్న స్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు నేరుగా కార్యరంగంలోకి దిగారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితరులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని, లేని పక్షంలో రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటిపోయే ప్రమాదం లేకపోలేదని కూడా చంద్రబాబు వారితో అన్నట్లు సమాచారం. రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనని ఆయన వాదించారు.

  • Loading...

More Telugu News