: లంకతో టీమిండియా తొలి టెస్ట్ నేటి నుంచే... మరికాసేపట్లో గాలెలో ప్రారంభం
భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్ కు మరికాసేపట్లో తెర లేవనుంది. ఇప్పటికే లంక చేరుకున్న టీమిండియా సిరీస్ కు సర్వసన్నద్ధమైంది. ఇక సిరీస్ లో రెండో టెస్టు అనంతరం లంక బ్యాటింగ్ దిగ్గజం కుమార సంగక్కర వీడ్కోలు పలకనుండడంతో అతడికి విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలని లంకేయులు భావిస్తున్నారు. మరోవైపు ఇటీవల వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ పుంజుకోవాలని టీమిండియా గట్టి పట్టుదలగా ఉంది. ఇరు జట్లు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ సిరీస్ పై క్రికెట్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నేటి ఉదయం లంక నగరం గాలెలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.