: మేడ్చల్ ఎస్సైపై నిర్భయ కేసు, అరెస్టు
రక్షక భటుడు భక్షక భటుడయ్యాడు. సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాల్సిన ఎస్సై...ఓ మహిళ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించి, అందుకు తగ్గ ప్రతిఫలం అనుభవిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... రంగారెడ్డి జిల్లా మేడ్చల్ ఎస్సై సతీష్ పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అరెస్టు చేశారు. ఎస్సై సతీష్ గత కొంత కాలంగా ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. అతనిపై నిఘా ఉంచిన ఉన్నతాధికారులు, మహిళ ఫిర్యాదు నిజమేనని నిర్ధారించుకున్నారు. దీంతో అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు.