: కొంతదూరం వెళ్లాక విమానం స్లో అయింది: చింతమనేని
టీడీపీ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బొండా ఉమ, ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు తదితరులున్న ఎయిరిండియా విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సురక్షితంగా ల్యాండ్ అవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటన గురించి చింతమనేని మీడియాకు వివరించారు. శంషాబాద్ నుంచి బయల్దేరిన ఈ విమానం కొంతదూరం వెళ్లాక ఎందుకో నెమ్మదించిందని, కారణం తెలియక తాము భయాందోళనలకు గురయ్యామని తెలిపారు. అయితే, సురక్షితంగా విమానం ల్యాండవడంతో తేరుకున్నామని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్యేలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఫిర్యాదు చేశారు.