: ఎక్కడ మొదలు పెట్టాడో...అక్కడే ముగించనున్నాడు!


క్రికెట్ చరిత్రలో పరిచయం అవసరం లేని పేరు కుమార సంగక్కర. వికెట్ కీపర్, బ్యాట్స్ మన్, కెప్టెన్... ఇలా ఏ బాధ్యత చేపట్టినా అందులో చిత్తశుద్ధి నిరూపించుకోవడం సంగ స్పెషల్. శ్రీలంక క్రికెట్ కు ఎనలేని సేవలు చేసిన సంగక్కర భారత్ తో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ లో తొలి టెస్టుతో అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు. సంగక్కర 2000లో శ్రీలంకలోని గాలె వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో అరంగేట్రం చేశాడు. అదే వేదికపై భారత్ తో జరిగే టెస్టు ద్వారా తను అంతర్జాతీయ టెస్టు క్రికెట్ కు వీడ్కోలు పలకనున్నాడు. సుదీర్ఘ కాలం శ్రీలంక క్రికెట్ కు సేవలందించిన సంగక్కర 132 టెస్టు మ్యాచ్ లు ఆడాడు. టెస్టుల్లో 38 సెంచరీలు, 52 అర్ధ సెంచరీలతో మొత్తం 12,305 పరుగులు చేశాడు. టెస్టుల్లో 179 క్యాచ్ లు పట్టిన సంగక్కర, 20 స్టంపింగ్ లు చేశాడు. దిగ్గజ క్రికెటర్ గా మన్ననలందుకున్న సంగక్కరకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు లంక క్రికెట్ బోర్డు సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News