: కనీసం టీ, కాఫీలు కూడా తాగను, ఇంకా డ్రగ్సా?: అక్షయ్ కుమార్


క్రీడల నేపథ్యంగా బాలీవుడ్ లో సినిమాలు నిర్మించడం హర్షించదగ్గ పరిణామమని నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన అక్షయ్ తాజా సినిమా 'బ్రదర్స్' ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి సినిమాలు రావడం వల్ల కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా ఇతర క్రీడల పట్ల కూడా ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందని అభిప్రాయపడ్డాడు. దేశీయ క్రీడలైన కబడ్డీ, హాకీలపై మరిన్ని సినిమాలు రావాలని అక్షయ్ ఆకాంక్షించాడు. యువత డ్రగ్స్ వంటి మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని సూచించాడు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే కోలుకోవడం కష్టమని అక్షయ్ పేర్కొన్నాడు. తానిప్పటి వరకు డ్రగ్స్ జోలికి వెళ్లలేదని అక్షయ్ తెలిపాడు. డ్రగ్స్ సంగతి అలా ఉంచితే అసలు కనీసం టీ, కాఫీలు కూడా తాగనని చెప్పాడు. కాగా ఈ 'బ్రదర్స్' సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.

  • Loading...

More Telugu News