: హైదరాబాద్-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం... వెనుతిరిగిన వైనం
హైదరాబాద్ నుంచి విజయవాడ సమీపంలోని గన్నవరం వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్ అయ్యాక ఫైలెట్ సాంకేతిక లోపం గుర్తించడంతో వెంటనే విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. ఈ విమానంలో టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, చింతమనేని ప్రభాకర్, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, అడ్వకేట్ జనరల్ సహా 109 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానంలో ఏసీ పనిచేయక చెమటలు పట్టి ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారట.