: సానియా మీర్జాకు మంత్రి పద్మారావు అభినందనలు
టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారం దక్కడం పట్ల తెలంగాణ మంత్రి పద్మారావు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ ప్రతిష్ఠను ఆమె ప్రపంచ స్థాయిలో నిలబెట్టారని కొనియాడారు. సానియాను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని మంత్రి సూచించారు. సానియా ప్రస్తుతం తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతోంది. టెన్నిస్ లో ఈ పురస్కారం లభించిన రెండవ క్రీడాకారిణి సానియా కావడం విశేషం. తొలిసారి 1996-97లో లియాండర్ పేస్ కు ఈ అవార్డు ఇచ్చారు.