: సాక్ష్యాలు లేనందుకు భానుకిరణ్ పై ఓ కేసు కొట్టివేత
మద్దెలచెరువు సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ కు నాంపల్లి కోర్టులో ఓ కేసు నుంచి విముక్తి లభించింది. గతంలో హంద్రీనీవా పనులను పొందిన కాంట్రాక్టర్లను దౌర్జన్యం చేసి రూ. 3 కోట్లు వసూలు చేశారని నమోదైన కేసులో తీర్పును వెలువరించింది. గతంలో సీఐడీ అధికారులు పెట్టిన కేసును కోర్టు ఈ సాయంత్రం కొట్టి వేసింది. ఈ కేసులో భానుకిరణ్ సహా మంగళి కృష్ణ, మధు, నాని, నీల శ్రీనివాస్ లు నిర్దోషులని ప్రకటించింది. సరైన ఆధారాలను చూపడంలో సీఐడీ విఫలమైందని ఈ సందర్భంగా కోర్టు అభిప్రాయపడింది.