: యువకులకు సదవకాశం: కోహ్లీ


టెస్టు క్రికెట్లో సత్తా చాటేందుకు యువకులకు శ్రీలంక సిరీస్ సదవకాశమని టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. రేపటి నుంచి శ్రీలంకతో మూడు టెస్టుల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో గాలెలో కోహ్లీ మాట్లాడుతూ, శ్రీలంకతో పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్నాడు. టెస్టు సిరీస్ లో పూర్తి స్థాయి ప్రదర్శన చేసేందుకు టీమిండియా సిద్ధంగా ఉందని కోహ్లీ తెలిపాడు. తొలి టెస్టులో ఐదుగురు బౌలర్లతో దిగాలని భావిస్తున్నట్టు కోహ్లీ వెల్లడించాడు. శ్రీలంకపై టెస్టు సిరీస్ నెగ్గి సుదీర్ఘ కాలమైన నేపథ్యంలో సిరీస్ ను గెలిచి, టెస్టు కెప్టెన్ గా సత్తాచాటాలని కోహ్లీ భావిస్తున్నాడు. కాగా, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి దిశానిర్దేశంలో ఆటగాళ్లు పూర్తిస్థాయిలో సన్నద్ధమైనట్టు కోహ్లీ వెల్లడించాడు.

  • Loading...

More Telugu News