: బాలీవుడ్ 'దృశ్యం'కు యూపీలో పన్ను మినహాయింపు... కృతజ్ఞతలు తెలిపిన అజయ్ దేవగణ్


బాలీవుడ్ రీమేక్ చిత్రం 'దృశ్యం'కు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వినోద పన్ను నుంచి మినహాయింపు ఇచ్చింది. అంతకుముందు 'మసాన్', 'భజరంగీ భాయ్ జాన్', 'హమారీ అధూరీ కహానీ' వంటి చిత్రాలకు కూడా యూపీ సర్కార్ పన్ను మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలో దృశ్యంలో నటించిన అజయ్ దేవగణ్ యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపాడు. దాంతో ప్రజలందరూ ఈ సినిమా చూసేందుకు అవకాశం దొరికిందన్నాడు. శ్రియ, టబు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News