: కాఫీతో ఊబకాయానికి, చక్కెర వ్యాధికి సంబంధం లేదట!
కాఫీ తాగితే ఊబకాయం, చక్కెర వ్యాధి వస్తాయని అనుమానం చాలా మందిలో ఉంది. అయితే, ఈ అనుమానాలన్నీ నిజం కాదని డెన్మార్క్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఊబకాయం, చక్కెర వ్యాధి రెండు కూడా జన్యుపరమైనవని... కాఫీ ఎక్కువ సేవించడం వల్ల వచ్చేవి కాదని స్పష్టం చేశారు. సుమారు 93 వేల మందిపై సుదీర్ఘంగా పరిశోధనలు నిర్వహించిన అనంతరం వీరు ఈ నిర్ణయానికి వచ్చారు. కొందరికి ఎక్కువ సార్లు కాఫీ ఇవ్వడం, మరికొందరికి కాఫీ ఇవ్వకపోవడం ద్వారా ఈ అధ్యయనం చేశారు. అయితే, చక్కెర వ్యాధి ఉన్నవాళ్లు కాఫీ ఎక్కువ సార్లు తాగకుండా ఉండటమే మంచిదని పరిశోధకులు సూచించారు.