: ఆగస్టు 15న పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభం కాదట... ట్రయల్ రన్ మాత్రమేనన్న మంత్రి పీతల సుజాత
పట్టిసీమ ప్రాజెక్టు ఈ నెల 15న ప్రారంభమవుతుందన్న ఆశతో ఉన్న రైతు ఆశలు ఆవిరైపోయాయి. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రారంభించనున్నామని ఇప్పటివరకూ చెబుతూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు మాట మార్చింది. 15న పట్టిసీమ ప్రాజెక్టు ట్రయల్ రన్ జరుగుతుందని, దీన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారని రాష్ట్ర మంత్రి పీతల సుజాత ఈ మధ్యాహ్నం వెల్లడించారు. ప్రాజెక్టు పనులను పర్యవేక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, నదుల అనుసంధానం కోసం శ్రీకారం చుట్టింది చంద్రబాబేనని అన్నారు. కాగా, పట్టిసీమ పనులన్నీ పూర్తయి నీరు ఎప్పుడు రైతుల పొలాలకు చేరుతుందో!