: ఆసుపత్రి పాలైన దర్శకుడిని పరామర్శించిన అమీర్ ఖాన్


రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ సైకిల్ పై వెళుతూ ప్రమాదానికి గురైన బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ ప్రస్తుతం ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి పాలైన ఈ స్టార్ డైరక్టర్ ను బాలీవుడ్ విలక్షణ హీరో అమీర్ ఖాన్ పరామర్శించారు. హిరానీ ప్రమాదంలో గాయపడ్డారన్న సమాచారం తెలుసుకున్న వెంటనే అమీర్ ఖాన్ లీలావతి ఆసుపత్రికి వెళ్లారు. ఆయనతో మాట్లాడిన అనంతరం ట్వీట్ చేశారు. హిరానీ బాగానే ఉన్నారని, ఈ సాయంత్రం డిశ్చార్జ్ అవుతారని పేర్కొన్నారు. హిరానీ-అమీర్ ఖాన్ కాంబినేషన్ లో వచ్చిన 'పీకే' ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Loading...

More Telugu News