: ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రికి చెందిన రూ. 200 కోట్ల భూమి కబ్జా


హైదరాబాదులోని ఎర్రగడ్డలో ఉన్న మానసిక వైద్యశాలకు చెందిన విలువైన భూమి అన్యాక్రాంతమైంది. రూ. 200 కోట్ల విలువైన భూమిని రఘువంశప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేశాడు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ రోజు కృష్ణారెడ్డితో పాటు కమిటీ సభ్యులు సుధాకర్ రెడ్డి, రాంరెడ్డి వెంకట్ రెడ్డిలు ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిని పరిశీలించారు. ఆనంతరం వారు మాట్లాడుతూ, కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందని తెలిపారు. కబ్జాకు గురైన భూమిని సంరక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖలపైనే ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News