: ధర్నా కోసం జగన్ రూ.2 కోట్లు ఖర్చు పెట్టారు: ఎంపీ జేసీ


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ చేసిన ధర్నాపై టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శలు చేశారు. ఆ ధర్నా కోసం ఆయన రెండు కోట్టు ఖర్చు పెట్టారని ఆరోపించారు. దానివల్ల జగన్ కు ప్రచారం వచ్చిందేమో కానీ ఫలితం మాత్రం రాలేదని ఎద్దేవా చేశారు. నిరసనలు, దీక్షలు గాంధీ కాలంలో చెల్లేవని, బంద్ వల్ల రాష్ట్రానికే నష్టమని ఢిల్లీలో జేసీ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ ది మొసలి కన్నీరని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News