: కాంగ్రెస్ పై స్పీకర్ ఫైర్... 450 మంది హక్కులను 40 మంది హరిస్తున్నారని ఆగ్రహం
ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీకి సుష్మా స్వరాజ్, వసుంధర రాజే సింధియాల సహకారంపైన, వ్యాపం కుంభకోణంపైన చర్చకు పట్టుబడుతూ పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం 40 నుంచి 50 మంది సభ్యులు మొత్తం సభలోని 450 మంది సభ్యుల హక్కులను హరిస్తున్నారని ఆమె కాంగ్రెస్ సభ్యులపై విరుచుకుపడ్డారు. నేటి సమావేశాల్లో భాగంగా పోడియంలోకి దూసుకొచ్చిన కాంగ్రెస్ సభ్యులను వారిస్తూ సుమిత్రా మహాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.