: నేపాల్ లో మళ్లీ భూకంపం
7.8 తీవ్రతతో విరుచుకుపడ్డ భయంకర భూకంపంతో ఇప్పటికే సర్వనాశనమైన నేపాల్ లో ఈ రోజు మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా ఉంది. ఈ ఉదయం 10.45 గంటలకు సంభవించిన ఈ భూకంప కేంద్రం ఖాట్మండూ వ్యాలీలో కేంద్రీకృతమైందని 'హిమాలయన్ టైమ్స్' పేర్కొంది. నిన్న కూడా 4.9 తీవ్రతతో నేపాల్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. మరోవైపు నేపాల్, ఉత్తర భారతదేశం మరో తీవ్రమైన భూకంపాన్ని చవిచూడాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించిన సంగతి గమనార్హం.