: స్పేస్ లో పాలకూర పండించిన నాసా వ్యోమగాములు!... రుచి కూడా చూశారు


నాసా వ్యోమగాములు అంతరిక్షంలో పాలకూర పండించారు. అంతేకాదు, దాన్ని వారు రుచి కూడా చూశారు! అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ద్వారా నాసా వ్యోమగామి స్కాట్ కెల్లీ, ఎక్స్ పెడిషన్ 44 వ్యోమగాముల బృందం తొలిసారి పాలకూరను పండించారని నాసా వెల్లడించింది. సగం ఆకుకూరను వ్యోమగాములు తినగా, మిగతా దాన్ని శాస్త్రీయ పరిశోధనల కోసం భూమికి తిరిగి వచ్చేంతవరకూ భద్రపరుస్తారని తెలిపింది. వారు ముగ్గురూ పాలకూర తింటున్న వీడియోను ట్విట్టర్ లో పోస్టు చేశారు. భవిష్యత్తులో సుదీర్ఘ అంతరిక్ష యాత్రలు చేపట్టే దృష్ట్యా వ్యోమగాములకు ఆహార అవసరాల కోసం నాసా వెజ్జీ ప్లాంట్ గ్రోత్ సిస్టమ్ ను అభివృద్థి చేస్తోంది.

  • Loading...

More Telugu News