: భూ సేకరణ బిల్లును అటకెక్కించనున్న కేంద్ర ప్రభుత్వం?... తాత్కాలిక విరామం
కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భూసేకరణ బిల్లు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దేశంలోని అన్ని విపక్షాలు, సామాజిక కార్యకర్తలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా లెక్క చేయకుండా... ఎలాగైనా ఈ బిల్లును పార్లమెంటులో గట్టెక్కించాలని మోదీ సర్కారు విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, ఈ బిల్లును తాత్కాలికంగా పక్కన పెట్టాలనే యోచనలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. రానున్న బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని... రైతులకు దగ్గర కావడానికి మోదీ సర్కారు ఈ నిర్ణయానికి వచ్చింది. బీహార్ లో బలమైన ఆర్జేడీ, జేడీయూ కూటమిని ఎదుర్కోవాలంటే... ప్రస్తుతానికి భూసేకరణ బిల్లును పక్కన పెట్టడమే బెటర్ అనే ఆలోచనలో బీజేపీ అధిష్ఠానం ఉంది. అయితే, ఇది కేవలం తాత్కాలికం మాత్రమే. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్లీ ఈ బిల్లును గట్టెక్కించేందుకు కేంద్రం శాయశక్తులా కృషి చేయనుంది.