: రోడ్డు ప్రమాదంలో బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి గాయాలు
బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ(52) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఆయనకు గాయాలవడంతో ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. హిరానీ దవడకు, గడ్డంకు తీవ్ర గాయాలైనట్టు తెలిసింది. ఈ గాయాలకు చిన్నపాటి శస్త్రచికిత్స చేస్తామని, ప్రాణానికి ఎలాంటి ప్రమాదంలేదని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ తెల్లవారుజామున తన దగ్గర పనిచేసే ఉద్యోగుల్లో ఒకరి నుంచి కొత్త రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ తీసుకుని హిరానీ రైడ్ కు వెళ్లారు. రోడ్డుపై తక్కువ వేగంతో వెళుతున్నప్పటికీ బైక్ అదుపు చేయలేక ఆయన కిందపడ్డట్టు తెలిసింది.