: దూసుకెళుతున్న పీవీ సింధూ... వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో బోణీ


వరల్డ్ బ్యాడ్మింటన్ టోర్నీలో తెలుగమ్మాయి పీవీ సింధూ దూసుకెళుతోంది. కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్ లో డెన్మార్క్ క్రీడాకారిణిపై విజయం సాధించిన సింధూ టోర్నీలో విజయాల బోణీ చేసింది. నేరుగా రెండో రౌండ్ లోకి దూసుకెళ్లింది. డెన్మార్క్ కు చెందిన జార్స్ ఫెల్ట్ తో జరిగిన మ్యాచ్ లో 11-21, 21-17, 21-16 స్కోరుతో సింధూ విజయం సాధించింది. రెండో రౌండ్ లో చైనాకు చెందిన లీ జారీతో ఆమె తలపడనుంది.

  • Loading...

More Telugu News