: సికింద్రాబాదులో ఘోరం... టిప్పర్ ఢీకొని డిగ్రీ విద్యార్థిని దుర్మరణం
సికింద్రాబాదు పరిధిలోని రైల్ నిలయం వద్ద నేటి ఉదయం ఘోరం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ కు వెళుతున్న ఓ విద్యార్థిని టిప్పర్ ఢీకొని మృతి చెందింది. డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్ సీసీ కేడెట్ గా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల 15న జరగనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాలుపంచుకోనున్న స్వప్న, అందుకోసం రిహార్సల్స్ చేసుకునేందుకు బయలుదేరింది. అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ టిప్పర్ అదుపు తప్పి జనాలపైకి దూసుకెళ్లింది. అదే మార్గంలో వెళుతున్న స్వప్నను కూడా ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ ప్రమాదం నేపథ్యంలో రైల్ నిలయం పరిసరాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యింది.