: సానియా మీర్జా కారుకు ఫైన్ వేసిన హైదరాబాదు ట్రాఫిక్ ఎస్ఐ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కారుకు హైదరాబాదు పోలీసులు ఫైన్ వేశారు. కారు నెంబర్ ప్లేట్ సరిగా లేదన్న కారణంగా ఆమె కారుకు చలానా రాసేశారు. రూ.200 జరిమానా చెల్లించాలని తాఖీదు ఇచ్చారు. వివరాల్లోకెళితే... నిన్న రాత్రి సానియా మీర్జా తన కారు (టీఎస్ 09 ఈజీ 1)ను జూబ్లిహిల్స్ రోడ్ నెం:10లోని పార్కింగ్ ప్లేస్ లోనే పార్క్ చేసింది. అటుగా వెళుతున్న ట్రాఫిక్ ఎస్ఐ రాఘవరావు దృష్టి ఆ కారుపై పడింది. పార్కింగ్ ప్రదేశంలోనే కారు పార్క్ చేసి ఉన్నా, దాని నెంబర్ ప్లేట్ మాత్రం సవ్యంగా లేదు. దీంతో వెనువెంటనే అక్కడికి చేరుకున్న రాఘవరావు రూ.200 చెల్లించాలని చలానా రాసేశారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని వైనాన్ని ఫొటో తీసి మరీ ఆయన చలానా రాశారు.